మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి దాదాపుగా ఖరారైనట్టే. త్వరలోనే... వరుణ్ పెళ్లి వార్త బయటకు రానుంది. ఈ విషయంలో నాగబాబు హింట్ ఇచ్చేశారు. వరుణ్ పెళ్లి కబురు త్వరలోనే వినిపిస్తామని, ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటిస్తామని నాగబాబు స్పష్టం చేశారు. వరుణ్‌కి ఇప్పుడు 33 ఏళ్లు. సో.. పెళ్లీడు వచ్చి, దాటేస్తున్నట్టే. సరైన సమయంలో వరుణ్‌కి పెళ్లి జరుగుతోంది.
అయితే మరో మెగా హీరో... సాయిధరమ్ తేజ్ వరుణ్ కంటే పెద్దోడు. వరుణ్‌కి 33 ఏళ్లు. సాయిధరమ్ తేజ్‌కి 36 ఏళ్లు. అంటే మూడేళ్లు పెద్ద. మరి తేజ్ ఎప్పుడు పెళ్లి చేసుకొంటాడో..? గతేడాది తేజ్‌కి యాక్సెడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంతో తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. లేదంటే ఈపాటికి తేజ్‌కి కూడా పెళ్లయిపోయేదే. మరోవైపు అల్లు శిరీష్ కూడా పెళ్లికి సిద్ధమయ్యాడని టాక్. 2023లో.. మెగా ఇంట్లో వరుసగా పెళ్లిళ్లు జరగబోతున్నాయన్న మాట.