మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఓ గొప్ప డెసిషన్ తీసుకున్నాడు. ఏంటో తెలుసా. ప్రస్తుతం అమ్మాయిల్ని ఏడిపించడం, టీజింగ్ పేరుతో నానా ఓవర్ యాక్షన్ చేయడం, అమ్మాయిల వెంటపడి టూమచ్‌గా బిహేవ్ చేయడం వంటివి చాలా సర్వసాధారణంగా మారిపోయాయి. సినిమాల్లోనూ ఈ సీన్స్‌కి క్రేజ్ ఎక్కువే. సినిమాల్లోనూ, బయటా కూడా డిఫరెన్స్ లేకుండా ఈ సీన్స్‌ని ఎంజాయ్ చేసవాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. బాధితులు, బాధించబడుతున్నారు. అయితే మన మెగా మేనల్లుడు ఇకపై తన సినిమాల్లో ఇలాంటి సీన్స్ లేకుండా చూసుకుంటానంటున్నాడు. 'విన్నర్' సినిమా దగ్గర్నుంచే ఈ నిర్ణయం తీసుకున్నాడట. అమ్మాయిల్ని ఏడిపించడమే కాదు, స్మోకింగ్ సీన్స్‌లో కూడా తాను నటించనంటున్నాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఇక మద్యపానం విషయానికి వస్తే, అది కూడా అత్యంత తప్పనిసరి అయితేేనే అలాంటి సీన్స్‌లో నటిస్తాడట. వారెవ్వా మెగా మేనల్లుడు. భలే డెసిషన్ తీసుకున్నాడే. అయితే ఎంత వరకూ దీన్ని ఫాలో చేయగలడనే విషయాన్ని పక్కన పెడితే, తీసుకున్న నిర్ణయం గొప్పదంటూ పలువురు మనోడ్ని ప్రశంసించేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్‌తో పాటు, మిగిలిన హీరోలు కూడా ఈ విషయంలో కొంచెం ఆలోచిస్తే బావుంటుంది. ఎందుకంటే సినిమా అనేది సమాజంపై ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. సినిమాల దగ్గరే సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఇలాంటి మహమ్మారి భూతాలకి అడ్డుకట్ట పడితే, సమాజంలో కొంతవరకూ అయినా మార్పుని ఆశించొచ్చు కదా.