సాయిపల్లవి అందుకే అంతలా నచ్చేస్తోంది

మరిన్ని వార్తలు

హీరోయిన్‌ అంటే మేకప్‌తో ఒకలా, మేకప్‌ లేకుండా ఇంకొకలా ఉంటారనే భావన చాలామందిలో ఉంది. హీరోయిన్ల మీద సెటైర్లు ఆ కోణంలో రావడం కొత్త కాదు. అయితే విత్‌ మేకప్‌ - వితౌట్‌ మేకప్‌ ఒకేలా ఉంటాననీ తన అందం గురించి తనకు చింత లేదనీ, నాచురల్‌గా ఉండటమే తనకిష్టమని చెప్పే హీరోయిన్లు చాలా అరుదుగా కన్పిస్తారు. అలాంటివారిలో సాయిపల్లవి ఒకరు. 

తొలి సినిమా 'పిదా'తోనే ఈ మలర్‌ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసేసింది. రెండో సినిమా 'ఎంసీఏ'లో కూడా హీరోయిన్‌గా సత్తా చాటింది. యాక్టింగ్‌ టాలెంట్‌, డాన్సింగ్‌ స్కిల్స్‌ ఇవిప్పుడు సాయిపల్లవిని టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్స్‌ రేసులో ముందుకు నడిపిస్తున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. అందాల ప్రదర్శన మాత్రం సాయిపల్లవికి అస్సలు ఇష్టం ఉండదట. సినిమానే తనకు జీవితం కాదనీ, సినీ రంగాన్ని ఎంచుకున్నది నటిగా తానేంటో ప్రూవ్‌ చేసుకోవడానికి మాత్రమేనని సాయిపల్లవి చెబుతుంటుంది. 

'ఫిదా', 'ఎంసీఏ' సినిమాలు తెలుగులో తనకు మంచి విజయాన్నిచ్చాయని చెబుతూ ఈ విజయాల్ని కొనసాగించగలనన్న నమ్మకం తనకు గట్టిగా ఉందని వివరించింది. మొటిమలతో కూడిన మొహం గురించి తానెప్పుడూ ఇబ్బంది పడింది లేదంటున్న సాయి పల్లవి, సహజంగా వచ్చే అందమే అందరికీ గుర్తుండిపోతుందనీ ఆ అందానికి అవసరం లేని మెరుగులు దిద్దడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని సాయిపల్లవి వెల్లడించింది. ఏదేమైనా కొత్త జనరేషన్‌ హీరోయిన్లలో సాయిపల్లవి చాలా డిఫరెంట్‌. అందుకే ఆమె అంతలా నచ్చేస్తోంది అందరికీ.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS