'ఫిదా' సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని తన నటనతో ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న తాజా చిత్రం నుండి ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. శర్వానంద్‌తో సాయి పల్లవి లేటెస్టుగా నటిస్తున్న చిత్రం 'పడి పడి లేచె మనసు'. మొన్నా మధ్య జోరున వర్షం. ముందు సాయి పల్లవి పరుగెడుతుంటే, వెనక శర్వానంద్ పరుగెడుతున్నాడు.
ఈ పోస్టర్‌ని వెనక నుండి చూపిస్తూ, రిలీజ్ చేశారు. ఇప్పుడదే పోస్టర్‌ని ముందు నుండి రిలీజ్ చేశారు. దాంతో పాటు, సాయి పల్లవి సోలో లుక్ కూడా రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో సాయి పల్లవి ట్రెడిషనల్ వేర్‌లో, ఫుల్ జోష్‌గా కనిపిస్తోంది. హోలీ పండగని తలపిస్తోంది ఈ లుక్. రంగులతో నిండిపోయి, జోష్‌గా చిందేస్తోంది ఈ పోస్టర్‌లో సాయి పల్లవి. ఆమెకు బర్త్‌డే విషెస్ చెబుతూ, చిత్ర యూనిట్ ఈ లుక్‌ని రిలీజ్ చేసింది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. 'లై'తో నిరాశ పరిచిన హను రాఘవపూడి ఈ సారి ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు.
అసలే సక్సెస్‌ల మీదున్న హీరో శర్వానంద్. లక్కీ బ్యూటీ సాయి పల్లవి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో. అది కూడా లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కావడంతో ఈ సినిమాతో హిట్ పక్కా అనే నమ్మకంతో ఉన్నాడట. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది.
శర్వానంద్‌కి ఫెస్టివల్ హీరోగా పేరుంది. సో ఈ సినిమాని దసరాకి విడుదల చేసే అవకాశాలున్నాయి. లేదంటే అంతకన్నా ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చినా రావచ్చు.