ఆ ముద్దుగుమ్మ నటించింది ఒన్ అండ్ ఓన్లీ తెలుగు సినిమా. కానీ అమ్మడికి వచ్చిన క్రేజ్ చూస్తే పది సక్సెస్ఫుల్ మూవీస్‌లో నటిస్తే వచ్చేంత క్రేజ్. సినిమా వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా, ఏదో ఒక రూపంలో ఆమెని తలవని వారుండట్లేదంటే అతిశయోక్తి కాదు. అంతలా మాయ చేసేసింది ఆ బ్యూటీ. ఆమె ఇంకెవరో కాదు సాయి పల్లవి. 'ఫిదా'తో తెలుగు తెరకు పరిచయమైంది. అంతకు ముందు మలయాళంలో 'ప్రేమమ్' సినిమాలో నటించింది ఈ బ్యూటీ. ఆ సినిమాతోనే తెలుగులో కూడా పాపులర్ అయిపోయింది. ఇక డైరెక్ట్‌గా వచ్చిన 'ఫిదా'తో అమ్మడు చేసిన మాయా జాలం అంతా ఇంతా కాదు. మెగా ప్రిన్స్ వరుణ్‌కి అమ్మడి రూపంలో సూపర్ సక్సెస్ వచ్చింది. అంతదాకా మర్చిపోయారనుకున్న క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు విజయం తెచ్చిపెట్టి న్యూస్‌లో నిలిచేటట్లు చేసింది. దీనికంతటికీ సాయి పల్లవి యాక్టింగ్ టాలెంట్, స్క్రీన్ ప్రెజెన్సే కారణం. ఒక్క సినిమాతో ఇంత స్టార్డమ్ సంపాదించేసుకున్నా, అమ్మడు అవకాశాల కోసం వెంపర్లాడడం లేదు. వచ్చిన ప్రతీ అవకాశాన్ని అంగీకరించట్లేదు. చాలా సెలెక్టివ్‌గా మాత్రమే సినిమాలు చేస్తానంటోంది. చేసే క్యారెక్టర్ మొదట తనకి సంతృప్తినివ్వాలట. అలాగే ఈజీగా ప్రేక్షకులకి చేరువ కావాలంటోంది. గ్లామర్‌కి దూరం అని ఈ ముద్దుగుమ్మ మొదటి నుండీ చెబుతూనే ఉంది. సినిమానే తనకి ప్రపంచం కాదంటోంది. అంతకు మించిన టార్గెట్స్ తన జీవితంలో ఉన్నాయంటోంది. చదువంటే తనకిష్టమనీ, డాక్టర్ పట్టా పొందడమే తన జీవిత లక్ష్యం అనీ చెబుతోంది నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.