తన మాటలపై వచ్చిన వివాదంపై సాయిపల్లవి వివరణ ఇచ్చారు. ‘విరాటపర్వం’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో కశ్మీర్ పండిట్స్, గోహత్యలపై వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలపై భజరంగ్ దళ్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు,. ఈ వివాదంపై సాయి పల్లవి వీడియో ద్వారా వివరణ ఇచ్చారు.
'' నా అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే నా మాటల వల్ల ఎవరూ ఇబ్బందిపడకూడదు. ఒకవేళ నా మాటలతో మిమ్మల్ని ఇబ్బందిపెట్టి ఉంటే క్షమించండి. ఇటీవల నేనిచ్చిన ఓ ఇంటర్వ్యూలో మీరు లెఫ్ట్ వింగ్‌కి మద్దతిస్తారా? రైట్ వింగ్‌కి మద్దతిస్తారా? అని అడిగారు. దానికి నేను వారికి, వీరికి అని కాకుండా ముందు మనం మంచి మనుషులుగా జీవించాలనే ఉద్దేశంతో సమాధానం చెప్పాను. కానీ, నా మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని ఏవేవో ప్రచారం చేశారు. నా దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పే. ఒక డాక్టర్‌గా ప్రాణం విలువ నాకు తెలుసు. ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ నాకు సపోర్ట్‌గా ఉన్న వాళ్లందరికీ నా కృతజ్ఞతలు'' తెలిపారు సాయి పల్లవి.