హేయ్ పిల్లగాడ అంటున్న సాయి పల్లవి

మరిన్ని వార్తలు

సాయి పల్లవి.. ఇప్పుడు ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో. దీనంతటికి కారణం, ఆమె ఫిదా చిత్రంలో చూపిన అభినయమే.

ఇక ఆమెకు వచ్చిన ఫాలోయింగ్ ని ఉపయోగించుకునే నేపధ్యంలో, సాయి పల్లవి-దుల్కర్ నటించిన కలి అనే మలయాళ చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. దీనికి ఫిదా చిత్రంలో మంచి హిట్ అయిన పాట హేయ్ పిల్లగాడ ని టైటిల్ గా పెట్టేశారు.

ఈ చిత్రానికి సంబందించిన లోగోని శేఖర్ కమ్ముల విడుదల చేసి ఈ చిత్రం విజయవంతం కావాలని కోరుకున్నారు. ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకి వచ్చే నెల 8వ తారీఖున విడుదల కానుంది.

చూద్దాం.. సాయి పల్లవికి ఈ డబ్బింగ్ సినిమాకి ఎన్ని మార్కులు పడతాయో అని.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS