ఎన్టీఆర్ సినిమాలో సైఫ్ అలీఖాన్‌?

మరిన్ని వార్తలు

ఎన్టీఆర్ - కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌. త‌ను న‌టిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఇప్పుడు ఓ బాలీవుడ్ స్టార్ ని విల‌న్ గా రంగంలోకి దించ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయ‌ని తెలుస్తోంది. త‌నేవ‌రో కాదు.. సైఫ్ అలీ ఖాన్‌. ఆర్‌.ఆర్‌.ఆర్‌తో ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా ఇమేజ్ వ‌చ్చింది. దీన్ని క్యాష్ చేసుకోవాల‌ని కొర‌టాల శివ కోరుకొంటున్నాడు. అందుకే పాన్ ఇండియాకు త‌గిన హంగులన్నీ త‌న క‌థ‌లో ఉండేట్టు జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. జాన్వీని రంగంలోకి దించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం అదే.

 

ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్‌ని సైతం విల‌న్ గా మారిస్తే ఈ సినిమాకి మ‌రింత క్రేజ్ వ‌స్తుంద‌ని కొర‌టాల భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం సైఫ్ తో కొర‌టాల అండ్ కో సంప్ర‌దింపులు జ‌రుపుతోంది. ఇందులో న‌టించ‌డానికి సైఫ్ కూడా త‌న అంగీకారం తెలిపిన‌ట్టు స‌మాచారం. కాక‌పోతే పారితోషికం ద‌గ్గ‌రే కాస్త పేచీ వ‌స్తోంద‌ట‌. సైఫ్ అడుగుతున్న పారితోషికం మ‌రీ ఊహించ‌నంత ఉంద‌ని, అంత ఇవ్వ‌గ‌ల‌మా? లేదా? అనే విష‌య‌మై చిత్ర‌బృందం త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతోంద‌ని టాక్‌. పారితోషికం విష‌యంలో ఓ క్లారిటీ వ‌స్తే.. సైఫ్ ఎంట్రీ కూడా ఖాయ‌మైన‌ట్టే. ఈ నెలాఖ‌రున ఈ సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. ఈలోగా.. సైఫ్ ఎంట్రీపై ఓ స్ప‌ష్ట‌త వ‌స్తుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS