సైఫ్ అలీఖాన్ కి వరస కష్టాలు

మరిన్ని వార్తలు

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ దేవర మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో దేవర 2 కాకుండా మరిన్ని తెలుగు సినిమాలు ఆఫర్స్ వస్తున్నాయట సైఫ్ కి. బాలీవుడ్ లో సరైన అవకాశాలు లేక డౌన్ లో ఉన్న సైఫ్ కి సౌత్ లో గుర్తింపు వచ్చింది. ఈ ఆనందంలో ఉన్న సైఫ్ తన ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తి చేతిలో గాయపడి హాస్పటల్లో జాయిన్ అయిన సంగతి తెల్సిందే. ట్రీట్ మెంట్ తరవాత సైఫ్ కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. డిస్చార్జ్ తరువాత తనంతట తానే నడుచుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. బయటికి దెబ్బలేం కనిపించలేదు.

ప్రాణాపాయం తప్పి బయట పడ్డ సైఫ్ కి ఇంకో షాక్ తగిలింది. సైఫ్ కుటుంబానికి చెందిన 15వేల కోట్ల ఆస్తుల‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప‌రిస్థితి ఎదురయ్యింది. పటౌడీ ఫ్యామిలికి చెందిన సైఫ్ కి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. కోహెఫిజా నుంచి చిక్లోడ్ వరకు చాలా విలువైన ఆస్తులు అన్నీ పటౌడీ కుటుంబానివే. కానీ అవన్నీ ఇన్నాళ్లు కోర్టు వివాదాల్లో ఉన్నాయి. 2015లో వీటిపై స్టే విధించింది మ‌ధ్యప్ర‌దేశ్ హైకోర్టు. ఆస్తిపై దావా వేయడానికి MP హైకోర్టు 30 రోజుల గడువు ఇచ్చింది సైఫ్ ఫ్యామిలీకి.   ప‌టౌడీ కుటుంబం సరైన వాద‌న‌ల‌ను వినిపించ‌కపోవటంతో తాజాగా స్టే ఎత్తి వేసింది కోర్టు.

భోపాల్ చివ‌రి న‌వాబ్‌ హ‌మీదుల్లా ఖాన్ కు ముగ్గురు కూతుర్లు, పెద్ద కూతురు అబిదా చ‌ట్ట‌బ‌ద్ధ వార‌సురాలు. కానీ ఆమె 1950లో పాక్‌కు వెళ్లిపోయిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. దీంతో ఈ ఆస్తిని ఎనిమీ ప్రాప‌ర్టీ యాక్ట్ 1968 ప్ర‌కారం ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకునే ఛాన్స్ ఉంది. న‌వాబ్ రెండో కూతురు సాజిదా సుల్తాన్ వార‌సులు సైఫ్ అలీఖాన్‌ ఫ్యామిలీ. తమకి ఆస్తి పై హక్కు ఉందని సైఫ్ తల్లి ష‌ర్మిలా ఠాగూరు 2015లో కోర్టుని ఆశ్ర‌యించగా కోర్టు స్టే విధించింది. ఇపుడు ఈ స్టేను ఎత్తివేయటంతో భోపాల్ లో ఐకానిక్ ఫ్లాగ్ స్టాఫ్ హౌస్, నూర్-ఉస్-సబా ప్యాలెస్, దార్-ఉస్-సలాం, బంగ్లా ఆఫ్ హబీబీ, అహ్మదాబాద్ ప్యాలెస్, కోహెఫిజా ప్రాపర్టీలను ప్రభుత్వం సొంతం చేసుకోనుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS