పుష్ష ని రెండు భాగాలుగా విడుదల చేస్తామని ప్రకటించి చిత్రబృందం షాక్ ఇచ్చింది. నిజానికి ఇది చాలా మంచి ఐడియా. నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చే ఆలోచన. ఈ స్ట్రాటజీలోని లాభమెంతో చిత్రసీమకు కూడా తెలిసొచ్చింది. అందుకేనేమో.. ఇప్పుడు సలార్ కూడా అదే బాటలో నడవబోతోందన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. ప్రభాస్ కథానాయకుడిగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సలార్ ని సైతం రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశం ఉందట.
నిజానికి ఈ రెండు భాగాల ఐడియా... ప్రశాంత్ నీల్ దే. తన కేజీఎఫ్ చాప్టర్ 1 ఇది వరకే విడుదలైంది. చాప్టర్ 2 విడుదలకు సిద్ధంగా ఉంది. ఓ సినిమాని రెండు భాగాలుగా తెరకెక్కించడంలోని లాభ నష్టాలు, ఆ స్ట్రాటజీ ప్రశాంత్ నీల్ కి బాగా తెలుసు. సలార్ ని సైతం.. ఆ కోణంలోనే చూస్తున్నాడు. ప్రభాస్ పాన్ ఇండియా హీరో. తనతో మళ్లీ మళ్లీ సినిమాలు చేసే అవకాశం రాకపోవొచ్చు. వచ్చినప్పుడే వాడుకుంటే ఎలా ఉంటుందన్నది ప్రశాంత్ నీల్ ఆలోచన. కేజీఎఫ్ లానే... సగం కథ చాప్టర్ 1లో చెప్పి, మిగిలిన సగం కథ చాప్టర్ 2లో చెప్పాలనుకుంటున్నాడట. ప్రస్తుతానికైతే, రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచన అయితే ఉంది. కానీ.. అది సాధ్యమవుతుందా, లేదా? అనే విషయంలో ప్రశాంత్ నీల్ తర్జన భర్జనలు పడుతున్నాడని, త్వరలోనే ఓ నిర్ణయానికి రావొచ్చని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.