బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్ 3' సినిమా ఈ నెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఆ క్రమంలో తాజాగా చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సౌత్ సినిమాలను రీమేక్ చేయడమంటే తనకెంతో ఇష్టమని సల్మాన్ ఈ మీట్లో తెలిపారు. చెన్నైతో తనకు ప్రత్యేకమైన అనుబంధముందనీ, 'వాంటెడ్' సినిమా కోసం నెల రోజులు చెన్నైలోనే ఉన్నాననీ సల్మాన్ చెప్పుకొచ్చారు. హిందీతో పాటు, తమిళ, తెలుగు భాషల్లోనూ విడుదల కానుంది. సోనాక్షి సిన్హా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు సుదీప్ విలన్‌గా నటించారు.
'దబాంగ్' సిరీస్‌లో వస్తున్న మూడో చిత్రమిది. మొదటి రెండు చిత్రాలూ సల్మాన్‌కి మంచి ఫలితాన్నిచ్చాయి. ఈ సినిమాపైనా అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అన్నట్లు అదే రోజు తెలుగులో బాలయ్య నటించిన 'రూలర్' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తేజు నటించిన 'ప్రతిరోజూ పండగే' చిత్రం కూడా అదే రోజు విడుదల కానుంది. మరి మన కండల వీరుడి 'దబాంగ్ 3' మన తెలుగు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ నమోదు చేస్తుందో చూడాలిక.