అట్లీ - సల్మాన్ కాంబో అసలు నిజాలు

మరిన్ని వార్తలు

ఒకప్పుడు సౌత్ లో స్టార్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అట్లీ ఈ మధ్య బాలీవుడ్ లో కూడా ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు. షారుక్‌ ఖాన్‌ హీరోగా జవాన్ తెరకెక్కించి, ఫుల్ మార్క్స్ కొట్టేసాడు. దీనితో బాలీవుడ్ లో బడాస్టార్ల చూపు అట్లీ పై పడింది. ఈ క్రమంలో అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ భాషలో ఉంటుంది, ఎవరు హీరో అనే చర్చలు జోరుగా జరిగాయి. మొదట అల్లు అర్జున్ తో అట్లీ మూవీ ఉంటుందని టాక్ వచ్చింది. తరవాత అది మరుగున పడిపోయింది. నెక్స్ట్ సల్మాన్‌ ఖాన్‌ తో అట్లీ ప్రాజెక్ట్ అన్న న్యూస్ చక్కర్లు కొట్టింది.  సల్మాన్‌ తో అట్లీ మూవీ ఖాయం అయిపోయిందని, భారీ బడ్జెట్ తో  తెరకెక్కనున్నట్లు, ఆల్మోస్ట్ స్క్రిప్ప్ట్ రెడీ అని కూడా ప్రచారం ఊపందుకుంది. 


దీనితో బాలీవుడ్ లో అట్లీ మరొక సారి సంచలనం సృష్టించనున్నాడని అంతా  అనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అవన్నీ వట్టి పుకార్లు అని తేలిపోయింది. సల్మాన్ సోదరుడు, అర్బాజ్‌ ఖాన్‌ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో అట్లీ, సల్మాన్ కాంబో మూవీ నిజం కాదని, వీటిపై వస్తున్న రూమర్స్‌ ని  నమ్మొద్దని పేర్కొన్నాడు. ‘దబాంగ్‌ 4’ చేసేందుకు ఇద్దరం ఆసక్తిగా ఉన్నామని, కానీ, అది ఎప్పుడు తెరకెక్కుతుందో తెలియదు. మేము మిగతా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నామని తెలిపాడు.


ఈ విషయం విన్న అట్లీ, సల్మాన్ ఫాన్స్ నిరాశకి గురి అయ్యారు. ఇప్పుడు కాకపోయినా తరువాతా ఎప్పుడైనా వీరిద్దరి కాంబో మూవీ రావటం గ్యారంటీ అని సరిపెట్టుకుంటున్నారు. ఇంతకీ అట్లీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది ఇంకా తెలియటం లేదు. బన్నీ, సల్మాన్ లాంటి స్టార్స్ ని మిస్ చేసుకున్నాడు. జవాన్ తో వచ్చిన క్రేజ్ ని అట్లీ సరిగ్గా ఉపయోగించుకోవటం లేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS