ఈ జనరేషన్ ముద్దుగుమ్మలకు స్టార్ హీరోయిన్ సమంత కొన్ని సూచనలిస్తుందండోయ్. స్టార్‌డమ్ అనేది అంత సులువుగా దక్కించుకునే ఇష్యూ కాదు. రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోవాలంటే, అన్ని పక్కల నుండీ అదృష్టం టన్నులు టన్నుల లెక్కన కలిసొచ్చేయాలనుకోండి.. విజయ్ దేవరకొండలా. సరే, ఆ విషయం అటుంచితే, కెరీర్ మొదట్లో హీరోయిన్లు తమదైన స్థానాన్ని పదిలంగా ఉంచుకోవాలంటే, ముందుగా గ్లామర్ తారగా, అంటే కమర్షియల్ హీరోయిన్‌గా వెలిగిపోవాలన్న సీక్రెట్ చెప్పేసింది. వన్స్ కమర్షియల్ హీరోయిన్ అన్న ముద్ర వేయించుకున్నాక, ఆ తర్వాత ఎలాంటి పాత్రలనైనా టేకప్ చేయగలమన్న ధైర్య సాహసాల్ని సొంతం చేసుకోగలమట.
అప్పుడు ప్రయోగాలకు బాటలు వేయాలంటోంది. కెరీర్‌లో ఎత్తు పల్లాలన్నవి చాలా కామన్. కానీ, వాటిని బ్యాలెన్స్ చేసుకోవడం తెలిస్తేనే కెరీర్‌ని ముందుకు నడిపించగలం అని అక్కినేని కోడలు ఈ తరం హీరోయిన్స్‌కి సూచనలిస్తోంది. మరి మన రామలక్ష్మి సూచనలు ఫాలో చేస్తే ఈ తరం ముద్దుగుమ్మలు కెరీర్‌ని రాకెట్ స్పీడుతో దూసుకెళ్లిపోవడం ఖాయమేనేమో. ఇకపోతే, సమంత ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే, త్వరలో 'జాను' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు 'ఫ్మామిలీ మేన్ 2' అనే ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తూ డిజిటల్ ప్లాట్‌ఫామ్ పైనా సందడి చేస్తోంది.