అందమైన ఎన్నో చిత్రాలను తన కుంచెతో ప్రాణం పోసిన చిత్రకారుడు రవివర్మ. ఆయన చిత్రాలపై అప్పట్లో ఎందరో కవులు ఎన్నోన్నో కవిత్వాలు వల్లె వేశారు. అయితే, జీవం పోసినట్లుండే ఆ రవివర్మ గీసిన చిత్రం నిజంగానే జీవంతో తిరిగొస్తే, ఎలా ఉంటుంది.? 'జీవం ఉట్టి పడేలా చిత్రాలున్నాయి.. అనడం వేరు.
నిజంగానే జీవం ఉన్న జీవులు చిత్రాల్లా మెరిసిపోవడం వేరు..' ఇప్పుడదే జరిగింది. ఇంతకీ అసలు విషయం ఏమంటారా.? ఓ ప్రముఖ ఫోటో గ్రాఫర్ రవివర్మ కుంచెతో గీసిన చిత్రాలకు తన కెమెరాతో జీవం పోశాడు.
ముద్దుగుమ్మలు సమంత, శృతిహాసన్, ఐశ్వర్యా రాజేష్ తదితర ముద్దుగుమ్మల్ని అచ్చు రవివర్మ చిత్రాల్లోని అందమైన బొమ్మల్ని తలపించేలా ముస్తాబు చేసి ఫోటో షూట్ చేశాడు. ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిజంగానే రవివర్మ గీసిన చిత్రాలు ప్రాణం పోసుకుని భువిపైకి వచ్చాయా.! అని ఆశ్చర్యపోయేంతలా ఈ ఫోటోలు ఉండడం విశేషం. ఇంతకీ ఈ గొప్ప ఫోటో గ్రాఫర్ పేరు తెలుసా.? వెంకట్రామన్.
ఈయన కెమెరా పనితనంతో సమంత, శృతిహాసన్, ఐశ్వర్యా రాజేష్‌లు రవివర్మకే అందని అందగత్తెలుగా మారిపోయారు. అప్పట్లో ఈ అందగత్తెలు రవివర్మకి చిక్కలేదు కాబోలు. కానీ, ఇప్పుడు మన వెంకట్రామన్ కెమెరాకి చిక్కేశారుగా.