షాకిస్తున్న సమంత కండిషన్స్

మరిన్ని వార్తలు

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కొంత కాలంగా సినిమాలకి విరామం ఇచ్చి, శారీరకంగా , మానసికంగా, ఫిట్ గా తయారయ్యింది. ఇప్పుడు రీఎంట్రీకి రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే వరుస అవకాశాలు అందుకుంటున్నట్టు టాక్. ఇప్పటికే కొలీవుడ్ హీరో విజయ్ తో ఒక సినిమా కమిట్ అయ్యింది. నెక్స్ట్ సల్మాన్ , మురుగుదాస్ కాంబో మూవీకి సమంత పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. తమిళం, హిందీలలో సూపర్ స్టార్స్ సరసన చాన్స్ లతో పాటు తెలుగులో కూడా, అట్లీతో బన్నీ చేయబోయే సినిమాకి సమంత ఆల్మోస్ట్ ఫైనల్ అయ్యింది. సుకుమార్ తో రామ్ చరణ్ చేయనున్న చిత్రానికి కూడా సమంత నే సంప్రదిస్తున్నారు. 


ప్రజంట్ తెలుగులో కొత్త హీరోయిన్స్ హవా నడుస్తోంది. పూజా హెగ్డే, రాశి ఖన్నా, తమన్నా , కీర్తి సురేష్ లకి కూడా ఛాన్స్ లు ఉండటం లేదు. అలాంటిది సామ్ ఒక ఏడాది గ్యాప్ తరవాత కూడా స్టార్ డైరక్టర్స్, హీరోలతో ఛాన్స్ లు అందుకుంటోంది. ఇంకో వైపు అమెజాన్ ప్రైమ్ వేదికగా సిటాడెల్ వెబ్ సిరీస్ తో త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. సామ్ కి ఇలా స్టార్ డైరక్టర్స్, హీరోలతో నటించే అవకాశాలువస్తున్నా, వారికి చాలా కండీషన్స్ పెడుతోంది అని సమాచారం.                 


రీ ఎంట్రీలో మంచి ఛాన్స్ లు వస్తున్నా, సామ్ ఎందుకు కండీషన్స్ పెడుతోంది అని ఆమె ఫాన్స్, కంగారు పడుతున్నారు. ఇంతకీ సామ్ కండీషన్స్ ఏంటి అంటే, సినిమాల్లో  నటించాలంటే తననే మొదటి హీరోయిన్ గా తీసుకోవాలని, సెకండ్ హీరోయిన్ గా చేయనని  తేల్చి చెబుతోందట. సామ్ కండీషన్స్ కి కొందరు షాక్ అవ్వగా, మరికొందరు సరే అని తల ఊపుతున్నారని తెలుస్తోంది. సామ్ ఇలాంటి కండీషన్స్ తో ఇబ్బందులు తప్పవని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS