ఇవాంక ట్రంప్ కి పెద్ద ఎత్తున స్వాగత కార్యక్రమాల ఏర్పాటులో తెలంగాణ సర్కార్ తలమునకలైంది. అందులో భాగంగానే ఇక్కడి సంస్కృతిని ఆమెకి పరిచయం చేసే పనిలో ఉన్నారు.
ఇక తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా సమంతా అక్కినేని గా నియమితులైన సంగతి విదితమే. ఈ సందర్భంగా, సమంత చేతుల మీదుగా ఇవాంక ట్రంప్ కి మెదక్ జిల్లాలో ప్రత్యేకంగా నేసిన ‘గొల్ల భామ’ చీరని ఆమెకి బహుమతిగా ఇవ్వనున్నారు.
చేనేత వస్త్రాలని ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముందున్నది అనే విషయం మనకి తెలిసిందే. అయితే ఈ ప్రెసిడెంట్ గారి అమ్మాయికి మరి మన బహుమతి నచ్చుతుందో లేదో చూడాలి.