ఉద్దేశ్యం ఘాటైనది అంటోన్న 'ఓ బేబీ'.!

మరిన్ని వార్తలు

బేబీ ఏంటీ.. ఉద్దేశ్యం ఏంటీ.. ఘాటు గోలేంటీ? అనుకుంటున్నారా.? 'మెలి తిరిగి ఉన్నా నాదే..' అంటూ చాన్నాళ్ల క్రితం రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో కుర్‌కరే యాడ్‌ టీవీలో ప్రసారమయ్యేది. ఆ యాడ్‌లో తర్వాత చాలా మంది సెలబ్రిటీలు తమదైన శైలిలో తళుక్కున మెరిశారు. పిల్లలు చాలా ఇష్టపడి తినే స్నాక్‌ ఐటెమ్‌ అది. అయితే, ఆ కుర్‌కురే పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదనే ఉద్దేశ్యంతో కొన్నాళ్లు బ్యాన్‌ విధించారు ఆ ప్రొడక్ట్‌ మీద. కానీ, మళ్లీ మార్కెట్‌లోకి వచ్చేసింది.

 

మన సెలబ్రిటీలు విచ్చలవిడిగా ఆ ప్రొడక్ట్‌ని ప్రమోట్‌ చేసేశారు. తాజాగా ఆ ప్రొడక్ట్‌ యాడ్‌లో మన బేబీ సమంత నటించింది. ఈ యాడ్‌కి సైన్‌ చేసిన కొత్తల్లోనే ఆ యాడ్‌లో నటించొద్దంటూ సమంతకు నెటిజన్లు సూచనలు, సలహాలూ ఇచ్చేశారు. కానీ, ఆమె వినలేదు. ఆ యాడ్‌ని టీవీల్లో బీభత్సంగా ప్రమోట్‌ చేస్తున్నారిప్పుడు. యాడ్‌ని ఘనంగానే డిజైన్‌ చేశారులెండి.

 

మన బేబీ క్యూట్‌ అండ్‌ నాటీగా కనిపిస్తోంది. చివరిలో 'ఉద్దేశ్యం ఘాటైనది..' అంటూ ఠక్కున కుర్‌కురే స్టిక్‌ని కొరికి చూపిస్తోంది. తాజాగా ఈ యాడ్‌లో సమంతను చూసిన నెటిజన్లు మరోసారి ఫైర్‌ అవుతున్నారు. ఇటీవలే 'ఓ బేబీ' సినిమాలో నటించి సమంత మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ వెబ్‌ సిరీస్‌లో నటించేందుకు సమంత సిద్ధమవుతోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS