విశాల్ హీరోగా తెరకెక్కుతోన్న 'ఇరుంబుతెరై' సినిమాలో నటిస్తోంది ముద్దుగుమ్మ సమంత. ఆ సినిమాలోనిదే ఈ స్టిల్. భలే ఆహ్లాదంగా ఉంది కదూ. లైట్ బ్లూ కలర్ డ్రస్సులో బీచ్ అందాల్ని ఆస్వాదిస్తూ సరికొత్త ఫీల్‌ని అనుభవిస్తోంది క్యూటీ శామ్. అలా ఫీల్ అవుతున్న సమంత స్టిల్ చూస్తుంటే అభిమానులు కూడా అదే ట్రాన్స్‌లోకి వెళ్లిపోయి, సమంత ఫీల్‌ని అడాప్ట్ చేసుకుంటున్నట్లుగా ఉంది. ఈ ఏడాది చైతూతో వివాహం, వరుస సినిమాలతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ సమంత. ఇటు తమిళంలోనూ, అటు తెలుగులోనూ కూడా బిజీ బిజీగా గడుపుతోంది. చైతూతో ప్రేమ ఫలించి, పెళ్లి పీటల దాకా చేరిందనుకున్నాక, సమంత గ్లామర్‌లో డోస్ పెంచేసింది. అంతవరకూ ఉన్న కొద్దిపాటి గీతల్ని చెరిపేసింది. ఎప్పటికప్పుడే ట్రెండీ పేరు చెప్పి, హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయించుకుని సోషల్ మీడియాకి కిర్రాక్ పుట్టించేసింది. తెలుగులో ప్రస్తుతం 'రంగస్థలం' సినిమాలో నటిస్తోంది సమంత.