మళ్లీ రెచ్చిపోయిన అక్కినేని కోడలు.

By Inkmantra - October 10, 2019 - 14:37 PM IST

మరిన్ని వార్తలు

కమర్షియల్‌ హీరోయిన్‌గా స్టార్‌డమ్‌ సంపాదించుకున్న సమంత, పెళ్లి తర్వాత ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. 'రంగస్థలం' నుండి సమంత పూర్తిగా మారిపోయింది. వరుస పెట్టి విలక్షణ చిత్రాలను ఎంచుకుంటోంది. ముఖ్యంగా ప్రాధాన్యత ఉన్న పాత్రలకే ఎక్కువ మొగ్గు చూపుతోంది. స్క్రీన్‌పై పెద్దగా ఎక్స్‌పోజింగ్‌కి ఆస్కారం లేని పాత్రల్ని ఎంచుకుంటోంది. ఆ లోటు తీర్చేందుకు నెట్టింట్లో హాట్‌ పోజులతో రెచ్చిపోతోంది. తాజాగా నెట్టింట్లో సమంత అక్కినేని పోస్ట్‌ చేసిన ఫోటో ఇప్పుడు నెటిజన్స్‌ నుండి భిన్న స్పందనల్నిస్తోంది.

 

వైట్‌ అండ్‌ నేవీ బ్లూ ప్యాటర్న్‌తో వర్ణించడానికి వీలు లేని ఓ టైప్‌ ఆఫ్‌ మోడ్రన్‌ డ్రస్‌ ధరించింది. చుక్కలు పొదిగిన ఆ బ్లూ టాప్‌ ట్రాన్స్‌పరెంటెడ్‌గా ఉంది. దాంతో దాగలేనంటూ అందాలు పెళ్లుబికి వస్తున్నాయి. ఇక బోటమ్‌ విషయానికి వస్తే, వైట్‌ విత్‌ డిజైనర్‌ ప్యాటర్న్‌లో ఓ చిన్న క్లాత్‌ టవల్‌లా నడుముకి చుట్టేసిందంతే. స్టైల్‌గా చేతులు కట్టుకుని, ఠీవీగా నిలబడింది. ఆయిలీ అండ్‌ సిల్కీ హెయిర్‌ని టూ హాఫ్స్‌ చేసి లూజ్‌గా వదిలేసింది. ముఖంలో ఓ రకమైన సెన్సువల్‌ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి, కుర్రకారు మతులు పోగొట్టేస్తోంది. ప్రస్తుతం సమంత సినిమాల సంగతి పక్కన పెట్టి, వెబ్‌ సిరీస్‌పై దృష్టి పెట్టిందని తెలుస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS