సమంత నే నంబర్ వన్

మరిన్ని వార్తలు

ప్రతి నెల ఆర్మాక్స్ మీడియా ఒక సర్వే చేసి టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ ని ప్రకటిస్తూ ఉంటుంది. ఫాన్స్  ఓటింగ్ ఆధారంగా సోషల్ మీడియాలో చేసే ఈ సర్వేలో టాప్ 10 హీరోయిన్స్ ని ఎవరన్నది ఆర్మాక్స్ అనౌన్స్ చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో చేసిన సర్వే ప్రకారం  ఆర్మాక్స్ టాప్ 10 పాపులర్ హీరోయిన్స్ జాబితా విడుదల చేసింది. ఇందులో నెంబర్ వన్ గా సమంత నిలవడం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కారణం ఒక ఏడాదిగా సామ్ సినిమాలకి దూరంగా ఉంది. చివరిగా తెలుగులో విజయ్ దేవర కొండతో నటించిన ఖుషి సినిమా తరవాత సినిమాలకి బ్రేక్ తీసుకుంది. అయినా కానీ సామ్ నంబర్ వన్ గా నిలవడం గమనార్హం. సామ్ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని, తన నటనకి ప్రముఖుల ప్రశంసలు పొందింది. తరవాత వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. సౌత్ లో ఇప్పటికీ ఆమె నంబర్ వన్ గా కొనసాగుతోందని ఈ సర్వే మరొక సారి రుజువుచేసింది. 


కొత్త భామల సందడి తో సామ్ హవా తగ్గుతుందని అంతా అనుకున్నారు కానీ, వరుస పానిండియా ప్రాజెక్ట్స్ చేస్తూ దూసుకుపోతున్న రష్మిక మందన్నని కూడా వెనక్కి నెట్టి మొదటి ప్లేస్ దక్కించుకొంది. ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం సామ్ సినిమాలకి దూరంగా ఉన్నా, సొషల్మీడియాలో యాక్టీవ్  గా ఉంటూ నిత్యం తన ఫాన్స్ కి టచ్ లో ఉంటుంది. సామ్ చేసిన ఎలాంటి పోస్ట్ అయినా నిముషాల్లో వైరలవుతుంది. సామ్ కి సొషల్మీడియా ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. త్వరలోనే సీటాడెల్ వెబ్ సిరీస్ హిందీ వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది కాకుండా తన సొంత నిర్మాణ సంస్థ నుంచి ఒక యాక్షన్ మూవీ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. టాలీవుడ్ క్రేజ్ హీరోయిన్ శ్రీలీల, పూజ హెగ్డే, లాంటి వారిని పక్కన పెట్టి సమంతకి పట్టం కట్టారు. అదీ సామ్ రేంజ్.


ఈ సర్వేలో మోస్ట్ పాపులర్ జాబితాలో రెండో స్థానంలో కాజల్ అగర్వాల్, నిలిచింది. కాజల్ ఈ మధ్య కార్తీక అనే హారర్ మూవీతో అలరించింది. త్వరలో సత్యభామ అనే ఫీమేల్ సెంట్రిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. మూడో స్థానంలో అనుష్క శెట్టి, నాలుగో స్థానంలో  శ్రీలీల, ఐదో స్థానంలో సాయి పల్లవి, ఆరో స్థానంలో రష్మిక మందన్న, ఏడో స్థానంలో తమన్నా, ఎనిమిదో స్థానంలో కీర్తి సురేష్, తొమ్మిదో స్థానంలో పూజా హెగ్డే, 10వ స్థానంలో  అనుపమ పరమేశ్వరన్ ఉన్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS