చైతూ ట్వీట్ తో చ‌ల్లారిన‌ట్టేనా

By Gowthami - September 15, 2021 - 10:43 AM IST

మరిన్ని వార్తలు

టాలీవుడ్‌లో ఎన్ని స‌మ‌స్య‌లున్నా - అంద‌రి ఫోక‌స్ స‌మంత - నాగ‌చైత‌న్య‌ల జంట‌పైనే. వీరిద్ద‌రూ విడిపోతున్నార‌ని, ఆల్రెడీ విడిపోయార‌ని, విడాకులు కూడా ఆన్ ద వే అని ర‌క‌ర‌కాల వార్త‌లు. స‌మంత చేష్ట‌లు సైతం - ఈ వార్త‌ల్ని బ‌ల ప‌రిచేలానే సాగాయి. పేరుకి ముందు అక్కినేని తొల‌గించ‌డం ద‌గ్గ‌ర్నుంచి - `ల‌వ్ స్టోరీ` గురించి చేసిన ట్వీట్ లో చైతూ పేరు ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం వ‌ర‌కూ అన్నీ - ఈ గాసిప్పుల‌కు గాలి అందించేవే.

 

ల‌వ్ స్టోరీ టీజ‌ర్ ని మెచ్చుకుంటూ.. స‌మంత సోమ‌వారం ఓ ట్వీట్ చేసింది. ఇందులో ఎక్క‌డా చైతూ ప్ర‌స్తావ‌న లేదు. దాంతో... మ‌రోసారి విడాకుల వార్త‌కు రెక్క‌లొచ్చాయి. వీటికి పుల్ స్టాప్ పెట్టాల‌న్న ఉద్దేశంతోనో, మ‌రోటో చైతూ `థ్యాంక్యూ శామ్‌` అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో ఈ గాసిప్పుల‌కు బ్రేక్ వేసిన‌ట్టైంది. స‌మంత ట్వీట్ లో త‌న పేరు లేక‌పోయినా చైతూ స‌మాధానం ఇచ్చాడంటే - ఈ వార్త‌ల‌కు బ్రేకులు వేయాల‌ని చైతూ నిర్ణ‌యించుకున్న‌ట్టే. త్వ‌ర‌లోనే `ల‌వ్ స్టోరీ` ప్ర‌మోష‌న్లు మొద‌లు కాబోతున్నాయి. చై మీడియా ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడైనా స‌రే.. స‌మంత వ్య‌వ‌హారంపై నోరు విప్పాలి. అందుకు మీడియాని కాస్త ప్రిపేర్ చేయ‌డానికి... ఈ ట్వీట్ పెట్టి ఉండొచ్చ‌న్న కామెంట్లు వినిపిస్తున్నాయిప్పుడు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS