ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డికి కరోనా సోకడంతో టాలీవుడ్ లో కలకలం రేగింది. శిల్పారెడ్డికి టాలీవుడ్ లో చాలామంది సన్నిహితులు ఉన్నారు. ఇటీవల శిల్పా ఇచ్చిన పార్టీకి సమంత, నాగచైతన్య కలిసి వెళ్లారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఆ పార్టీ తరవాత శిల్పా రెడ్డి కరోనా టెస్టులు చేయించుకుంటే పాజిటీవ్ అని తేలిందని గుసగుసలు వ్యాపించాయి.
దాంతో సమంత, నాగచైతన్య లు కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారని, రిపోర్టులు రావాల్సివుందని రూమర్లు వ్యాపించాయి. దాంతో సమంత, చైతూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. వీటిపై సమంత స్పందిస్తే బాగుంటుంది. లేదంటే ఈ రూమర్లు ఆగేట్టు లేవు. సోషల్ మీడియాలో సమంత యాక్టీవ్ గానే ఉంటుంది. అయినా.. ఈ విషయమై సమంత నోరు విప్పడం లేదు. దాంతో గాసిప్ రాయుళ్లు మరింత రెచ్చిపోతున్నారు. వీటిని బ్రేక్ చేయాలంటే.. సమంత సైలెన్స్ వీడాల్సిందే.