సమంత క్రేజ్ అప్పుడే తగ్గిపోయిందా?

మరిన్ని వార్తలు

సౌత్ లో సమంత క్రేజే వేరు. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్ళు అవుతున్నా, అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా జూనియర్స్, కుర్ర హీరోల పక్కన నటిస్తూ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఈ మధ్య ఆర్మాక్స్ మీడియా చేసిన సర్వేలో 'మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్'లో సామ్ సెకండ్ ప్లేస్ లో నిలవటం గమనార్హం. మయాసైటీస్ కారణంగా వన్ ఇయర్ సినిమాలకి బ్రేక్ ఇచ్చి, పూర్తి ఫిట్ గా తయారయ్యి ఇప్పుడు రీఎంట్రీ కి సిద్దమయ్యింది సామ్. ఈ క్రమంలో  ఓ వైపు వెబ్ సిరీస్, ఇంకో వైపు లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ, తెలుగు, తమిళం, హిందీ, మలయాళం సినిమాల్లో ఆఫర్స్ అందుకొంటోంది.


ఎంతో ఉత్సాహంగా రీ ఎంట్రీ కి సిద్దమైన సామ్ కి ఒక చేదు అనుభవం ఎదురైనట్లు టాక్. అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నా, ఇప్పటివరకు సీనియర్ హీరోలతో నటించలేదు అలాంటిది ఏకంగా వదిన పాత్రకి సామ్ ని సంప్రదించారని టాక్. టాలీవుడ్ లో ప్రముఖ బ్యానర్, బడా హీరో సినిమాలో సమంత కి వదిన పాత్ర ని ఆఫర్ చేసారని, ఆ హీరో తో సామ్ ఇంతకముందు జోడి గా నటించిందని సమాచారం. ఈ ప్రపోజల్ విన్న సామ్ అదిరిపడి 'నేనా....అప్పుడే వదిన పాత్రా' అన్నదట. లేడీ ఓరియంటెడ్ మూవీస్, సిరీస్ లు చేసుకుంటా, అవి కూడా లేకపోతె ఖాళీగా ఉంటా కానీ వదిన, అక్కా లాంటి పాత్రాలు ఇప్పట్లో చేయనని ఖరాకండీగా చెప్పేసిందట. 


పుష్ప సినిమాలో  చేసిన ఐటెం సాంగ్ సామ్ కెరియర్ కి హెల్ప్ చేసినా, పర్సనల్ లైఫ్ చిక్కులో పడిందన్నది వాస్తవం. ఇక అలాంటి తప్పుడు నిర్ణయాలు మరొకసారి తీసుకోనని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి సహాయక పాత్రల్లో కూడా నటించనని, ఇంకొకరు తన దగ్గరికి రాకముందే స్పష్టత ఇచ్చేసింది సమంత.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS