మొత్తానికి సమంతా అక్కినేని వారి ఇంటి కోడలు అవ్వడానికి సగం లైన్ క్లియర్ అయింది.
అదేనండి పెళ్లి కి ముందు జరిగే ఎంగేజ్మెంట్ నిన్న రాత్రి అట్టహాసంగా జరిగిపోయింది. అయితే ఫంక్షన్ కి వచ్చిన ప్రతి ఒక్కరి దృష్టి సమంతా కట్టిన చీర వైపే వెళ్ళిందట. ఒకరకంగా చెప్పాలంటే అసలు ఈ ఈవెంట్ మొతానికి “ఆ చీరనే” హైలైట్ అని అందరు అంటున్నారు.
ఇక విషయానికి వస్తే, సమంతా కట్టిన చీర పైన తను చైతుతో కలిసి చేసిన ఏ మాయ చేసావే సినిమా నుండి మొన్న జరిగిన అఖిల్ ఎంగేజ్మెంట్ వరకు అక్కినేని కుటుంబంతో దిగిన పిక్స్ ఈచీర పైన “సీక్వెన్స్ వర్క్” చేసారు. దీనితో అందరు సమంతా-చైతు ని వదిలేసి ఆ చీర పైనే కాన్సన్ట్రేట్ చేసారట. అయితే ఈ చీరను ముంభైకి చెందిన ప్రముఖ డిజైనర్ ఒకరు చేసారు. ఈ కాన్సెప్ట్ కుడా ఆ డిజైనర్ సలహానే అట.
ఏది ఏమైనా సమంతా-చైతులది ఏ సినిమాకి తీసిపోని ప్రేమకథనే!!