తమిళంలో ఘన విజయం సాధించిన '96' మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష జంటగా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో శర్వానంద్, సమంత జంటగా రూపొందుతోంది. ఒరిజినల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెలుగులోనూ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స బ్యానర్లో దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఇంతవరకూ '96' రీమేక్ పేరుతోనే సినిమా షూటింగ్ కానిచ్చేశారు. లేటెస్ట్గా ఈ సినిమాకి టైటిల్ ఖరారు చేశారు. 'జాను' అనే టైటిల్‌తో ఓ ఫస్ట్‌లుక్ కూడా వదిలారు. ఎడారిలో నాలుగు ఒంటెల్ని తాడుతో లాగుతూ శర్వానంద్ కనిపిస్తున్న పోస్టర్ ఇది. 'షరతులు, నియమాలు, హద్దులు లేని ప్రేమకు అసలైన నివాళి..' అని ఈ ఫస్ట్‌లుక్‌పై రాసుంది.
స్కూల్ లైఫ్‌లో స్టార్ట్ అయిన లవ్ కొన్ని కారణాలతో బ్రేకప్ అయిపోయి, మళ్లీ కొన్నేళ్ల తర్వాత ఓ సందర్భంలో కలిసే ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమా ఇది. తెలుగులో మహానటులైన శర్వానంద్, సమంతలు ఈ సినిమాకి ప్రాణం పెట్టేస్తారనే నమ్మకం ఖచ్చితంగా ఉంది ఆడియన్స్‌లో. 'జాను' సమంత పాత్ర పేరు అని తెలుస్తోంది. టైటిల్‌ని బట్టి, సమంత పాత్రకు హీరో పాత్ర కన్నా అధిక ప్రాధాన్యత ఉండబోతోందనీ తెలుస్తోంది. అసలే ఈ మధ్య సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటించడం లేదు.. జీవించేస్తోంది. అలాంటిది 'జాను'గా మరోసారి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలిక.