సమంతకు సర్జరీ జరగబోతోందా? అందుకోసం హఠాత్తుగా అమెరికా వెళ్లిపోయిందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సమంత కొంత కాలంగా చర్మ సంబంధమైన సమస్యతో బాధ పడుతోందని టాక్. అది ఈమధ్య మరింత ఎక్కువగా అయ్యిందట. అందుకే అమెరికా వెళ్లిపోయిందని, అక్కడ సమంతకు సర్జరీ జరగబోతోందని టాక్.
విజయ్ దేవరకొండతో `ఖుషి` అనే సినిమాలో నటిస్తోంది సమంత. ఈనెలలోనే సమంత - విజయ్‌లపై కీలక సన్నివేశాలు తెరకెక్కించాలని నిర్ణయించారు. అయితే సమంత షూటింగ్ కి డుమ్మా కొట్టింది. దానికి కారణం.. స్కిన్ ఎలర్జీ తిరగబెట్టడమే. అందుకే ఇప్పుడు అమెరికాలో సర్జరీ చేయించుకోవాలని సమంత నిర్ణయించుకొందని, అందుకే సడన్ గా అమెరికా ఫ్లైట్ ఎక్కేసిందని టాక్. సమంత ఇది వరకు కూడా ఆరోగ్య సమస్యలతో సతమతమైంది. అప్పుడు కూడా సర్జరీలు అవసరమయ్యాయి. ఇప్పుడు మరోసారి... సమంత అనారోగ్యం తిరగబెట్టింది. ఈనెలాఖరు వరకూ సమంత అమెరికాలోనే ఉంటుందని, తిరిగొచ్చాకే షూటింగుల్లో పాలు పంచుకుంటుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. సమంత నటించిన `శాకుంతలమ్`, `యశోద` విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే.