నిర్మాతగా బిజీగా మారిన సామ్

మరిన్ని వార్తలు

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఎవరి సపోర్ట్ లేకుండా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్ గా సౌత్ లో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా పాగా వేసేందుకు ప్రయత్నం చేస్తోంది. అప్పుడే సామ్ కెరియర్ మొదలు పెట్టి 15 ఏళ్లు అయిపోయింది. కానీ ఇంకా ఫుల్ ఫామ్ లో ఉంది. వ్యక్తిగత కారణాల వలన ఇబ్బంది పడినా కెరియర్ డౌన్ అవలేదు. ప్రస్తుతం 'హానీ- బనీ' వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని అలరించేందుకు సిద్దమయ్యింది. 


హీరోయిన్ గా సత్తాచాటుతూనే సొంత నిర్మాణ సంస్థ కూడా స్థాపించి 'మా ఇంటి బంగారం' అన్న మూవీ అనౌన్స్ చేసింది. తానే ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఫీమేల్ సెంట్రిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని టాక్. అంతే కాదు సామ్ నిర్మాతగా బడ్జెట్ కి వెనకాడకుండా మంచి దూకుడు మీద ఉందని. మా ఇంటి బంగారం కోసం ఓవర్ బడ్జెట్ పెట్టేందుకు వెనకాడటం లేదని సమాచారం. ఇప్పుడు కూడా ఇంకో రెండు ప్రాజెక్ట్ ల నిర్మాణానికి సిద్ధం అయ్యిందని తెలుస్తోంది. కాకపోతే అవి సినిమాలు కాదు సిరీస్ లు. 


తనకి OTT లో బ్రేక్ ఇచ్చిన రాజ్ అండ్ డీకే లతో కలిసి ఇంకో రెండు వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట సామ్. నిర్మాతగా మొదటి ఫలితం చూడకుండానే ఇలా మరో రెండు సీరీస్ లను నిర్మించేందుకు సిద్దమవటం గమనార్హం. సామ్ కొత్త జర్నీ విజయవంతంగా సాగాలని ఆమె ఫాన్స్ కోరుకుంటున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS