ముద్దుగుమ్మ సమంత, త్వరలోనే అక్కినేని వారింటి కోడలు కానున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 6న సమంత, నాగ చైతన్యల వివాహం జరగనుంది. గోవాలో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఆ తర్వాత హైద్రాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఉంది. హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాల్లో సమంత, నాగచైతన్య వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ లోగా సమంత పెళ్లికూతురిగా తాను ఎలా ఉండబోతున్నానని పలు రకాల కలెక్షన్స్ సిద్ధం చేయించుకుని ఫోటో సెషన్స్ కూడా చేయించుకుంటోంది. అందులోని కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సమంత స్నేహితురాలు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ క్రేశా బజాజ్ సమంత కోసం కొన్ని కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించింది. వాటిలో దిగిన ఫోటోల్ని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలు చూసి, అభిమానులు సమంతకి పెళ్లి కళ వచ్చేసిందనుకుంటున్నారు. ఎంగేజ్‌మెంట్‌లో కూడా సమంత తన ప్రేమ జ్ఞాపకాలను అందంగా పొదిగిన చీరతో దర్శనమిచ్చి అందరి దృష్టినీ స్పెషల్‌గా ఆకర్షిచింది. అలాగే పెళ్లిలో కూడా సమంత వెరీ వెరీ స్పెషల్‌గా కనిపించనుందనీ, అందుకు క్రేశా బజాజ్ తయారుచేసిన కాస్ట్యూమ్స్‌ని ధరించబోతోందని తెలయవస్తోంది. ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం 'రంగస్థలమ్' సినిమాలో నటిస్తోంది. నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'రాజుగారి గది - 2'లోనూ సమంత నటిస్తోంది.