బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్ గా వివాదస్పద నటుడు

మరిన్ని వార్తలు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 మొదలయి దాదాపు వారం కావొస్తుంది. ఈ తరుణంలో బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ గా ఒకరిని నియమించుకునే క్రమంలో నిన్నటి రోజున ఈ సీజన్ తొలి కెప్టెన్ గా నటుడు సామ్రాట్ ఎంపికయ్యాడు.

కెప్టెన్సీ కొరకు సామ్రాట్ తో పాటుగా గణేష్, భాను శ్రీ, సంజనా పోటీపడగా బిగ్ బాస్ ఇంటిలోని పార్టిసిపెంట్స్ ఎక్కువ మంది సామ్రాట్ వైపుకి మొగ్గుచూపడం తో ఆయనే ఈ సీజన్ తొలి కెప్టెన్ అవ్వగలిగాడు. దీనితో ఇక బిగ్ బాస్ ఇంకా రసవత్తరంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

ఇక సామ్రాట్ బిగ్ బాస్ లోకి వచ్చే కొద్ది రోజుల ముందు తన వ్యక్తిగత జీవితంలో ఏర్పడిన కొన్ని సమస్యల కారణంగా ఒక వివాదస్పద నటుడిగా ముద్రపడిపోయాడు. అసలు సామ్రాట్ ఈ సీజన్ లో ఒక కంటేస్టంట్ గా రావడం అందరికి ఆశ్చర్యాన్ని కలిగించింది.

మరి ఈ బిగ్ బాస్ హౌస్ లో తన పెర్ఫార్మన్స్ తో అందరిని ఆకట్టుకోవాలని ఆశిద్దాం..   

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS