'డెవిల్‌'గా 'అర్జున్‌రెడ్డి' డైరెక్టర్‌?

మరిన్ని వార్తలు

'అర్జున్‌రెడ్డి' సినిమాతో తెలుగులో సెన్సేషనల్‌ విజయం అందుకున్న దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా, ఇదే సినిమాని హిందీలోనూ రీమేక్‌ చేసి అక్కడ కూడా బ్లాక్‌ బస్టర్‌ కొట్టాడు. సంచలన విజయంతో పాటు, ఇక్కడా, అక్కడా కూడా ఈ సినిమాతో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు సందీప్‌ రెడ్డి వంగా. అయితే, అపారమైన సక్సెస్‌ ముందు ఆ క్రిటిక్స్‌ అన్నీ బలాదూర్‌ అయిపోయాయి. ఆ విమర్శలు సందీప్‌రెడ్డిని మరింత స్ట్రాంగ్‌గా మార్చేశాయి. విమర్శకులకు ధీటుగా ఎదురు సమాధానం చెప్పాడు సందీప్‌ రెడ్డి వంగా.

 

తెలుగులో 'అర్జున్‌ రెడ్డి', హిందీలో 'కబీర్‌ సింగ్‌' సినిమాలు దారుణమైన విమర్శలకు గురి కావడానికి కారణం సినిమాలోని బోల్డ్‌ కంటెంటే. అయితే, తన తదుపరి చిత్రం మరింత బోల్డ్‌గా తెరకెక్కిస్తానని క్రిటిక్స్‌కి సవాల్‌ విసిరాడు సందీప్‌ రెడ్డి వంగా. అయితే తన తదుపరి చిత్రం తెలుగులో ఉండబోతుందని చెప్పిన సందీప్‌ రెడ్డి, ఇప్పుడు మాట మార్చేశాడు. బాలీవుడ్‌లోనే నెక్స్‌ట్‌ మూవీ ప్లాన్‌ చేస్తున్నాడనీ తాజా సమాచారం. అక్కడి స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌తో సందీప్‌ రెడ్డి సినిమా ప్లాన్‌ చేస్తున్నాడనీ బాలీవుడ్‌ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం.

 

కట్‌ చేసి చూస్తే, గతంలో మహేష్‌బాబుకు చెప్పిన స్టోరీ లైన్‌ని డెవలప్‌ చేసి ఇప్పుడు రణ్‌బీర్‌ కపూర్‌తో తెరకెక్కిస్తున్నాడనీ తెలుస్తోంది. 'డెవిల్‌' అనే టైటిల్‌తో ఈ స్క్రిప్ట్‌ని రణ్‌బీర్‌కి వినిపించాడట. టైటిల్‌తో పాటు, కంటెంట్‌ కూడా ఆయనకు తెగ నచ్చేసిందట. వెంటనే పట్టాలెక్కించేద్దాం అని హామీ ఇచ్చాడట. సో త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. బాగానే ఉంది కానీ, తన నెక్స్‌ట్‌ మూవీలో 'అర్జున్‌రెడ్డి', 'కబీర్‌సింగ్‌'ను మించిన బోల్డ్‌నెస్‌ ఉంటుంది.. అని సందీప్‌ చెప్పిన మాట నిలబెట్టుకుంటాడా.? ఈ సినిమాని మరీ అంత బోల్డ్‌గా తెరకెక్కిస్తాడా.? అనేది చూడాలిక.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS