2017లో ఇద్దరు దర్శకులు అనూహ్యంగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. వారే సందీప్ రెడ్డి వంగా, ప్రవీణ్ సత్తారు. 'అర్జున్‌రెడ్డి' సినిమాతో సందీప్ రెడ్డి వంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమా విడుదలకు ముందు వివాదాలు చుట్టుముట్టాయి. అసలీ సినిమా ఇన్ని వివాదాల మధ్య విడుదలవుతుందా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. కానీ సినిమా విడుదలైంది. వివాదాల సంగతి ఎలా ఉన్నా మంచి విజయం దక్కించుకుంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు ఈ సినిమాతో సందీప్ రెడ్డి. ఇండస్ట్రీలో అందరి దృష్టినీ ఆకర్షించాడు.
ఇక ప్రవీణ్ సత్తారు విషయానికి వస్తే, ఇంతవరకూ చిన్న సినిమాలనే తెరకెక్కించిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. సడెన్‌గా భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎంచుకున్నాడు. సీనియర్ హీరో అయినప్పటికీ, ఫెయిల్యూర్స్‌లో ఉన్న రాజశేఖర్‌ని పెట్టి సినిమా తెరకెక్కించాడు. అదే 'గరుడవేగ'. రాజశేఖర్‌ని నమ్మి ప్రవీణ్ సత్తారు ఇంత భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కించడమేంటనీ చాలా మంది ఆశ్చర్యంతో అవహేళన చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ప్రవీణ్ సత్తారు కథని నమ్మాడు. కాన్సెప్ట్ నమ్మాడు. ఎవరెన్ని మాటలన్నా, పట్టించుకోకుండా, రాజశేఖర్ అని కాకుండా, హీరోని నమ్మాడు. సినిమా విడుదలైంది. ఊహించని విధంగా అన్న వాళ్ల నోళ్లు వెల్లబెట్టేలా విజయం సాధించింది. యాక్షన్ సీక్వెన్సెస్, రాజశేఖర్ యాక్టింగ్, డైరెక్టర్ పనితనం, అన్నీ హాలీవుడ్ సినిమా స్థాయిని తలపించేలా ఉంది 'గరుడవేగ'. ఫెయిల్యూర్స్‌లో ఉన్న రాజశేఖర్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు ఈ సినిమాతో. ప్రవీణ్ సత్తారు సత్తా ఉన్న డైరెక్టర్ అనిపించుకున్నాడు.
అలా ఈ రెండు సినిమాలతో ఈ ఇద్దరు డైరెక్టర్లు 2017 సంవత్సరానికి మోస్ట్ పాపులర్ డైరెక్టర్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఏడాది బెస్ట్ డైరెక్టర్స్‌లో ప్రత్యేకంగా నిలిచారు.