దక్షిణాది నటి సంజన గల్రాని ఒక వినూత్నమయిన నిరసన చేపట్టారు. సంజన ఈమధ్య ఎక్కువగా సామజిక అంశాలపై బాగా దృష్టి పెట్టారు. మైసూర్ లో లలిత్ మహల్ లో ఒక హెలిపాడ్ నిర్మాణానికి టూరిజం డిపార్టుమెంట్ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అయితే ఇందుకు గాను కొన్ని వందల చెట్లను నరికివేయటం జరుగుతోంది. ఇలా చెట్లు నరకటం మంచిది కాదని పర్యావరణానికి హాని జరుగుతుందని సంజన చెప్తున్నారు. ఇందుకోసం ఆమె ఒక ఫోటో షూట్ చేసారు.
అందులో ఎండిపోయిన చెట్టు దగ్గర సంజన పడి ఉండటం చెట్లు లేకపోతే మనిషి మనుగడకే కష్టం అవుతుందని వచ్చే అర్థం ఆ ఫోటో షూట్. ఇదిలా ఉండగా సంజన కి కరోనా పాజిటివ్ అని తెలిసింది. ప్రస్తుతం ఆమె తన ఇంట్లో ఇసోలేశన్ లో వున్నారు.. సంజన భర్త డాక్టర్ కావటం తో అతనికి హాస్పిటల్ లో కరోనా వైరస్ వచ్చింది, అతని ద్వారా సంజన కి వచ్చింది. డాక్టర్స్ ఫ్యామిలీస్ ఇలా కరోనా బారిన పడటం వల్ల డాక్టర్స్ కాదు వాళ్ళ ఫామిలీస్ కూడా త్యాగం చెయ్యాల్సి వస్తోంది.