ప్రముఖ నటుడయిన సంజయ్ దత్ ఈ మధ్యనే తన పై ఉన్న టాడా కేసుకి సంబంధించి విదించిన శిక్షాకాలం పూర్తి చేసుకుని సాధారణ జీవితం గడుపుతున్నాడు.
అయితే నిన్ననే సంజయ్ పై మరొక కేసులో ముంబై మేజిస్ట్రేట్ కోర్టు ఆయన పై నాన్- బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. అసలు కేసు వివరాలని పరిశీలిస్తే, నూరాని అనే నిర్మాత 2013లో ఒక చిత్రంలో నటించమని సంజయ్ కి రూ 40 లక్షలు అడ్వాన్సు గా చెల్లించాడు.
అయితే ఆ చిత్రం నిర్మాణం కాలేదు, దానితో సంజయ్ ని ఆ డబ్బులు వెనక్కి ఇవ్వమని కోరగా అతను ఇవ్వలేదు అన్నది నూరాని ఆరోపణ. అయితే దీనికి సంబంధించి కోర్టు కి ఇంతవరకు సంజయ్ హాజరు కాకపోవడాన్ని గర్హిస్తూ కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది.