మాజీ హీరోయిన్, ఐటమ్ సాంగ్ కూడా చేసిన మాన్యత, బాలీవుడ్ హీరో సంజయ్‌దత్‌ని పెళ్ళాడిన సంగతి తెలిసినదే కదా. ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేయడం, ఆ ఎంజాయ్‌మెంట్‌ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకోవడం ఇప్పుడు ఓ ట్రెండ్ అయ్యింది. సీనియర్ నటీనటులు, యంగ్ హీరోయిన్లు, యంగ్ హీరోలు, ఇతర సెలబ్రిటీలూ ఈ ట్రెండ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మాన్యత కూడా తన భర్త, పిల్లలతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేసిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిల్లో మాన్యత బికినీ గ్లామర్ అందరికీ పెద్ద షాకే ఇచ్చింది. ఈ మధ్యకాలంలో ఈ బ్యూటీని ఇలా ఎవరూ చూడలేదు. సంజయ్‌దత్‌తో పెళ్ళయ్యాక మాన్యతలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పులోంచి ఇది ఇంకా పెద్ద మార్పు. ఎందుకంటే సంజయ్‌దత్‌తో పెళ్ళయిన తర్వాత మాన్యత ఇంత గ్లామర్ ప్రదర్శించడం ఇదే తొలిసారి. పర్సనల్ లైఫ్‌లో వెరీ వెరీ లవ్‌లీ మూమెంట్స్ ఉంటాయనీ, వాటిని అభిమానులతో పంచుకోవడంలో ఆ కిక్కే వేరంటోంది మాన్యత. ఆమెకి లభించే కిక్ ఎలా ఉన్నా, చూసే అభిమానులకి కిక్కు ఓ రేంజ్‌లో ఎక్కేస్తుంది. ఆ స్థాయిలో బికినీ గ్లామర్ మాన్యత దత్ ఒలకబోసేసింది కదా. గ్లామర్‌కి వయసుతో పనిలేదన్న మాట ఎప్పటినుంచో వింటున్నదే. మొన్నీమధ్యన బాలీవుడ్ భామ కాజోల్ కూడా ఇలాగే ఫ్యామిలీతో బికినీల్లో ఫొటోలకు పోజులిచ్చింది.