కన్నడ హీరోయిన్ సంజన రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీ లో ఫిటీషన్ వేసింది. ప్రసిద్ధి అనే ప్రముఖ చిట్ ఫండ్స్ కంపెనీ రూ. 26 లక్షలు మోసం చేసిందంటూ ఆ సంస్థ యజమానులైన మహేష్, అతని భార్య నిరూప పై చర్యలు తీసుకోవాలని కోరింది.
ఈ సంస్థ మెయిన్ బ్రాంచ్ బెంగుళూరు లో ఉంది. ఈ దంపతులు చిట్ ఫండ్స్ పేరుతో సుమారు 100 కోట్లు మోసం చేసినట్లు తెలుస్తుంది. గత రెండు నెలలుగా ఈ సంస్థ కార్యాలయం మూసివేసి వుంది. ప్రస్తుతం దంపతులు ఇద్దరూ పరారీలో ఉన్నారు.
ఈ కంపెనీ లో సంజన రూ. 26 లక్షలు పెట్టిందట. ఈ మేరకు ఆమె మల్లేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ అయ్యప్పను కలిసి ఫిటీషన్ సమర్పించింది. తనను మోసం చేసిన దంపతులను మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తామని సంజన కి పోలీసులు హామీ ఇచ్చినట్టు తెలిపింది.