తలైవర్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా.. రారా! ఈ విషయం పై చాలా సంవత్సరాల నుండి పెద్ద చర్చే జరుగుతుంది.ఇటీవల జయలలిత మరణం తరువాత ఏర్పడిన పరిస్థితుల్లో మళ్ళీ ‘సూపర్ స్టార్’ రాజకీయ రంగ ప్రవేశం పైన అందరి దృష్టి నెలకొంది. కాని వీటిని కండిస్తూ వస్తుంది రజని కుటుంబం.
ఇలాంటి సమయంలో శరత్ కుమార్ రజిని పై చేసిన పొలిటికల్ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపింది. వివరాల్లోకి వెళితే, ఈ మధ్య జరిగిన విలేకరుల సమావేశంలో రజని రాజకీయలోకి రావడం తనకి ఇష్టం లేదని అలాగే తను గనక సొంత పార్టీ పెడితే తప్పక వ్యతిరేకిస్తానని చెప్పాడు. ఈ కామెంట్స్ పై రజని అభిమానుల్లో అలజడి రేపింది, శరత్ కుమార్ దిష్టి బొమ్మలు దహనం చేశారు.
అయితే వెంటనే శరత్ కుమార్ తన వ్యాఖ్యలను వక్రీకరించి చూపించారు అని వివరణ ఇచ్చుకున్నాడు. ఏమైతే ఏంటి రజని రాజకీయాల్లోకి వచ్చినా రాకున్న అతనికున్న అభిమానగణం, పాపులారిటీ ముందు ఎవరైనా దిగదుడుపే.
దటిజ్ సూపర్ స్టార్ రజినీకాంత్..




