కేరళ మార్కెట్లో అల్లు అర్జున్‌కి మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ అల్లు అర్జున్‌ని అంతా మల్లు అర్జున్ అని ముద్దుగా పిలచుకుంటారు. అల్లు అర్జున్ సినిమాలకు మంచి వసూళ్లు దక్కుతుంటాయి అక్కడ. అయితే, ఈ సారి సీన్ రివర్స్ అయ్యింది. కేరళలో 'సరిలేరు..' సినిమాకి అనూహ్యంగా భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నెవ్వర్ బిఫోర్, ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా అత్యధిక ధియేటర్స్‌లో అక్కడ 'సరిలేరు..' రిలీజ్ అవుతోంది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ కాని రేంజ్లో అక్కడ 'సరిలేరు..' మూవీ రిలీజ్ అవుతుండడం ట్రేడ్ వర్గాల్ని ఆశ్చర్యపరుస్తోంది.
విడుదలకు ముందు సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన 'సరిలేరు..' విడుదల తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకోనుందో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. దాదాపు కేరళలోని 30 సెంటర్లలో మహేష్ మూవీ విడుదలకు ముస్తాబయ్యింది. ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. జనవరి 11న అంటే శనివారం ఉదయం 6 గంటల 30 నిమిషాలకు తొలి షో పడనుంది. మరోపై చిత్ర యూనిట్ ఏ ఆఖరి నిమిషాన్నీ వదలకుండా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. సరికొత్త పంథాలో మహేష్ అండ్ టీమ్ హుషారుగా ప్రమోషన్స్‌లో పాల్గొంటూ, ఫ్యాన్స్‌లో కొత్త జోష్ నింపుతున్నారు.