ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు... ఏఎన్నార్ సాంఘిక కథలు ఎంచుకుని రెచ్చిపోయారు. అలాగని ఎన్టీఆర్ సాంఘిక చిత్రాలు చేయలేదని కాదు.. ఏఎన్నార్ పౌరాణిక గెటప్పులు వేయలేదని కూడా కాదు. ఆయా పాత్రలకు వాళ్లు ఫేమస్ అంతే. అక్కినేని హీరోలు.. పౌరాణిక పాత్రల వైపు దృష్టిసారించలేదు. నాగార్జున అయితే మరీనూ. వంద సినిమాల కెరీర్‌లో ఒకే ఒక్కసారి పౌరాణిక పాత్ర చేశాడు. అదీ అతిథిగానే.
ఇప్పుడు నాగచైతన్య వంతు వచ్చింది. `సవ్యసాచి` కోసం అర్జునుడి గెటప్‌లోకి వెళ్లాడు చైతూ. సవ్యసాచి అంటేనే అర్జునుడు. అందుకే ఆ గెటప్‌లో ఒక్కసారైనా కనిపిస్తే బాగుంటుందన్నది దర్శకుడు చందూ మొండేటి ఆలోచన. దానికి తగ్గట్టుగానే అర్జునుడిగా మారిపోయాడు చైతూ. అందుకు సంబంధించిన స్టిల్ బయటకు వచ్చింది కూడా.
ఈ స్టిల్ పై చాలా.. రకాలైన సెటైర్లు పుట్టుకొచ్చాయి. ఈ గెటప్ చైతూకి మరీ కామెడీగా ఉంది అని అభిమానులే... ట్విట్టర్‌లో కామెంట్లు షేర్ చేసుకుంటున్నారు. అయితే... ఇది కామెడీ కోసం వేసిన గెటప్పే. ఈ చిత్రంలో ఓ కామెడీ ఎపిసోడ్ ఉంది. `దమయంతీ స్వయం వరం` పేరుతో 5 నిమిషాల బిట్ తెరకెక్కించారు. అందులో చైతూ అర్జునుడిగా, వెన్నెల కిషోర్ కృష్ణుడిగా నవ్వించబోతున్నారు. కామెడీ సీన్ కోసం వేసిన వేషం కాబట్టి.. గెటప్ కామెడీగా ఉన్నా ఫర్వాలేదు. అందుకే చైతూ చేసిన ఈ సాహసానికి మరీ వంకలు పెట్టాల్సిన అవసరం లేదేమో.