సెల్ఫీకి కాదేది అనర్హం అని చాలామందే నిరూపించేశారు. అయితే ముద్దుగుమ్మ సీరత్ కపూర్ ఇంకొంచెం కొత్తగా ఆలోచించింది. తనలోని టాలెంట్‌ని ఇలా ప్రదర్శించింది. ఇలాక్కూడా సెల్ఫీ తీసుకోవచ్చా? అని అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది సీరత్ కపూర్. 'రాజుగారిగది-2' సినిమాలో నాగార్జున సరసన నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో చెలరేగిపోవడం ఆమెకు కొత్త కాదు. అయితే ఈ మధ్య సీరత్ సోషల్ మీడియాని హీటెక్కించడం తగ్గించేసింది. కానీ కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ సోషల్ మీడియాని హీటెక్కించేస్తోంది. ఫొటోగ్రఫీ ఈ ముద్దుగుమ్మకి హాబీగా మారిపోయిందట. అయితే రెగ్యులర్‌గా ఫోటోలు దిగితే వింతేముంటుంది. ఏదో ఒక సెన్సేషన్ ఉండాలి కదా అంటోంది. అందుకే ఇలా సెల్ఫీలతో సెన్సేషన్ సృష్టించేయాలనుకుంటున్నానని చెప్పింది ఈ బ్యూటీ. మేకప్ రూమ్‌లో అద్దం ముందు కూర్చుని తీసుకున్న ఈ సెల్ఫీని చూపిస్తూ మురిసిపోతోంది సీరత్‌కపూర్. స్టిల్ క్రియేటివ్‌గా ఉన్నా, కొంచెం వల్గర్‌గా అనిపిస్తోంది. అయినా కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ ఫోటో. మోడలింగ్ రంగం నుంచి సినిమాల్లోకి వచ్చిన ఈ బ్యూటీ, డాన్సర్‌గా కూడా పనిచేసింది. గ్లామర్ అంటే అది దాచుకునేది కాదనీ, ప్రదర్శించేదని కొత్త నిర్వచనం చెబుతుంటుంది సీరత్‌కపూర్. ఆ దాచుకోవడం తగ్గిపోయినప్పుడే వల్గారిటీ అనిపిస్తుందని సీరత్కపూర్కి ఎప్పుడర్థమవుతుందో!