సీనియ‌ర్ల వెనుక‌డుగు.. ఆ సినిమాలు ఆల‌స్య‌మే!

By Gowthami - October 16, 2020 - 17:05 PM IST

మరిన్ని వార్తలు

లాక్ డౌన్ స‌మ‌యంలో... షూటింగులు ఎప్పుడు మొద‌ల‌వుతాయా? అని అంతా ఎదురు చూశారు. తీరా షూటింగులకు అనుమ‌తులు ఇచ్చాక మాత్రం హీరోలంతా మీన‌మేశాలు లెక్కేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా అగ్ర హీరోలు షూటింగులకు రావ‌డానికి మొండికేస్తున్నారు. దాంతో ఆయా సినిమాల‌న్నీ మ‌రింత ఆల‌స్యం కానున్నాయి. చిరంజీవి `ఆచార్య‌` ఈ నెల‌లోనే మొద‌లు కావాలి. కానీ... చిరంజీవి షూటింగుల‌కు నో చెప్ప‌డంతో మ‌రో నెల రోజులు ఆల‌స్యం అవుతోంది.

 

బాల‌కృష్ణ ది కూడా ఇదే మాట‌. బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల‌లో షూటింగ్ మొద‌లు కావాలి. కానీ.. బాల‌య్య షూటింగుల‌కు రాన‌ని చెప్పేయ‌డంతో చిత్ర‌బృందం ఇప్పుడు సందిగ్థంలో ప‌డింద‌ని టాక్‌. బాల‌య్య లేకుండానే షూటింగ్ మొద‌లెట్టాల‌ని భావిస్తున్నారట‌. బాల‌య్య డిసెంబ‌రు నుంచి సెట్లోకి అడుగుపెట్టే ఛాన్సుంద‌ని తెలుస్తోంది.

 

వెంక‌టేష్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. `నారప్ప‌` షూటింగ్ అప్ డేట్ గురించి అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ వెంకీ కి మాత్రం షూటింగుల మూడ్ లేదు. ఈనెల‌లో `నార‌ప్ప‌` ప‌ట్టాలెక్క‌డం క‌ష్ట‌మే అని తేలింది. దాంతో నారప్ప విడుద‌ల మ‌రింత ఆల‌స్యం కానుంది. మ‌హేష్ బాబు, ప్ర‌భాస్, గోపీచంద్‌, అల్లు అర్జున్‌... వీళ్ల షూటింగులు కూడా మొద‌ల‌వ్వ‌లేదు. మ‌రోవైపు యంగ్ హీరోలు చ‌క చ‌క త‌మ సినిమాల్ని మొద‌లెట్టేశారు. సీరియ‌ర్లూ షూరూ చేస్తే చిత్ర‌సీమ మ‌రింత క‌ళ‌క‌ళ‌లాడుతుంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS