బుల్లి తెర నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని మధుర నగర్‌లోని తన ఫ్లాట్‌లోని బాత్రూంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య వెనుక ఓ టిక్ టాక్ స్టార్ ఉన్నాడని సమాచారం. కాకినాడకు చెందిన దేవరాజు రెడ్డితో శ్రావణికి టిక్ టాక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది.
అయితే గత కొంతకాలంగా శ్రావణిని దేవరాజ్ మానసికంగా వేధిస్తున్నట్టు సమాచారం. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రావణి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దేవరాజు వేధింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని శ్రావణి కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఎస్.ఆర్ నగర్ పోలీసులు కేసుని నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.