క్వీన్ చిత్ర దర్శకుడైన వికాస్ బేల్ పైన ఒక యువతీ ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా బాలీవుడ్ షాక్ అయ్యింది.
తెలుస్తున్న వివరాల ప్రకారం, వికాస్ కి సంబందించిన నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న యువతీ పై గోవాలో ఒక షూటింగ్ సందర్భంగా అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. దీనితో సదరు నిర్మాణ సంస్థ వికాస్ పై ఆ సంస్థలో ఓవిచారణకి ఆదేశించినట్టు వినికిడి!
అయితే దర్శకుడు వికాస్ మాత్రం ఇవన్ని అబద్దాలు అని కేవలం తన పైన ఉన్న కక్షతోనే ఆ యువతీ లేనిపోని ఆరోపణలు చేస్తుందని స్పష్టంచేశాడు.
ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి పోలీసు కేసు అయితే నమోదు కాలేదు. చూద్దాం.. ఈ ఆరోపణల్లో నిజం ఉందా లేక వికాస్ చెప్పేదాంట్లో నిజం ఉందా అని.