ఈ మధ్యకాలంలో నటీమణుల పైన లైంగిక వేధింపులకి సంబంధించిన వార్తలు ఎక్కువగా వింటున్నాము. నిన్న గాక మొన్ననే నటి అమలా పాల్ పైన లైంగిక వేధింపులు జరగడం మనం చూశాం.
ఇక నిన్ననే నటి సనూష పైన కూడా ఇటువంటి లైంగిక వేధింపులు జరిగాయి. అయితే ఆమె వెంటనే స్పందించి అతడిని పోలీసులకి పట్టించింది. అసలేం జరిగిందంటే- సనూష ట్రైన్ లో ప్రయాణిస్తున్న సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి ఆమె పడుకున్న బెర్త్ దగ్గరికి వచ్చి ఆమెని పట్టుకోబోతుండగా అతడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది.
అయితే ఆ సమయంలో పక్కన వారు ఎవ్వరూ ఆమెకి అండగా నిలబడనందుకు తాను ఎక్కువగా బాధ పడినట్టు తెలిపింది. ఇదే సమయంలో మిగతా ఆడవారికి ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఉండాలి అని, అలాగే అప్పటికప్పుడే ఆ సమస్యని అందరి దృష్టికి తీసుకురావాలని కోరింది.
తనకి ఇంతటి బాధలో తోడుగా నిలిచిన తన కుటుంబానికి ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపింది.