షారుక్ కు ఆపరేషన్... ఫాన్స్ ఆందోళన

మరిన్ని వార్తలు

బాలీవుడ్ బాద్షా షారుఖ్ గత కొన్నాళ్లుగా హుషారుగా ఉన్నాడు. కారణం పట్టిందల్లా బంగారం కావటమే. పఠాన్, జవాన్, డంకి సినిమాలు వరుసగా వందలకోట్లు వసూళ్లు చేసాయి. షారుక్ కి హ్యాట్రిక్ ఇచ్చాయి. నెక్స్ట్ ఐపీల్ లో హోరా హోరీగా సాగిన పోరులో కోల్ కత్తా టీమ్ విజయం సాధించింది. ఇవి కాకుండా ప్రతిష్ఠాత్మక అవార్డ్స్ కూడా అందుకుంటున్నాడు. ఈ మద్య గ్రేవిన్స్ మ్యూజియం షారుక్ ఫొటో, పేరు ఉన్న బంగారు నాణెం రిలీజ్ చేశారు. వీటన్నిటిని చూసి  షారుక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇంతలోనే  షారుక్ గూర్చి ఒక న్యూస్ వైరలవటంతో ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. 


కారణం షారుక్ 'ఐ' ట్రీట్ మెంట్ కోసం అమెరికా వెళ్లాడని తెలియటమే. ఈ మధ్య తరచుగా షారుక్ కంటి సమస్యతో బాధపడుతున్నాడని, లోకల్ గా ట్రీట్ మెంట్ తీసుకున్నా ఉపయోగం లేకపోవటంతో ఫారిన్ కి పయన మైనట్లు టాక్. ముంబైలోని ఓ ప్రముఖ కంటి వైద్యుడి సూచన మేరకే అమెరికా ట్రీట్ మెంట్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. కంటికి నార్మల్ ట్రీట్ మెంట్ సరిపోదని సర్జరీ చేయాలని వైద్యులు తెలిపినట్టు సమాచారం. అందుకోసమే వైద్యం కోసం అమెరికాకు వెళ్తున్నాడు షారుక్. తన వెంట భార్య గౌరీ ఖాన్, కొడుకు ఆర్యన్ కూడా వెళ్తున్నారు.    
 

ఈ సమస్య ఐపీఎల్ మ్యాచ్ టైంలోనే బయట పడినట్టు తెలుస్తోంది. షారుక్ వెంటనే ట్రీట్ మెంట్ చేయించుకుంటే సరిపోయి ఉండేదని ఫాన్స్ కంగారు పడుతున్నారు. షారుక్ ఏజ్ వలన కూడా చూపు మందగించే అవకాశం ఉంది. పెద్దగా కంగారేమి లేదని, మోడరన్ టెక్నాలజీ అందుబాటులో ఉందని. షారుక్ పూర్తిగా ఈ సమస్య నుంచి బయట పడతారని ఫాన్స్ ఆశిస్తున్నారు. షారుక్  త్వరగా కోలుకొవాలని, కొత్త మూవీ అప్డేట్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS