షారుఖ్ ఖాన్ కు సినిమాలే కాదు వ్యాపారాలూ వున్నాయి. ఒక నిర్మాణ సంస్థ, ఐపీయల్ ఫ్రాంచైజీ, గ్రాఫిక్స్ స్టూడియో, దుబాయిలో హోటల్, కిడ్జైన్ అనే ఎంటర్టైన్మమెంట్ సంస్థలో వాటాదారుగా.. ఇలా పలు వ్యాపారాలు వున్నాయి.
ఇప్పుడు మరో అడుగు వేశాడు. సొంత ఒక ఓటీటీ సంస్థని ఏర్పాటు చేస్తున్నాడు. 'ఎస్ఆర్కే ప్లస్' అనే పేరుతో ఓటీటీ యాప్ తీసుకోస్తున్నాడు. దీనికి సంబధించిన లోగో కూడా విడుదల చేశారు. ఈ ఓటీటీలో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా ఒక పార్టనర్. కంటెంట్ బేస్డ్ సినిమాలు, వెబ్ సిరిస్ లు చేయాలనే ప్లానింగ్ తో 'ఎస్ఆర్కే ప్లస్' ఓటీటీ అడుగులు వేస్తుంది. 'ఎస్ఆర్కే ప్లస్' ఓటీటీ కి సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ తో అనేక మంది సెలబ్రిటీలు ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'ఎస్ఆర్కే ప్లస్' ఓటీటీ ప్రపంచంలో ఒక సంచలనం అవుతుందని కరణ్ జోహార్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో పెద్ద స్టార్లు సైతం నేరుగా ఓటీటీకి సినిమాలు, వెబ్ సిరిస్ లు చేస్తున్నారు. ఇప్పుడు ఓటీటీ రేసులోకి షారుక్ సంస్థ కూడా వచ్చింది. షారుక్ ఓటీటీ ద్వారానే కొడుకు ఆర్యన్ సినిమా రంగ ప్రవేశం చేస్తాడనే టాక్ నడుస్తుంది. అలాగే అనురాగ్ కశ్యప్ ఓ వెబ్ సిరిస్ ని ఆర్యన్ ని ద్రుష్టిలో పెట్టుకొని తయారుచేస్తున్నాడని కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం షారుఖ్ 'పఠాన్' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా డిజిటల్ హక్కులు కూడా షారుఖ్ ఓటీటీ దక్కించుకునే అవకాశం వుంది.