'శుభ్రత - పరిశుభ్రత' ఇవి ఆరోగ్యానికి మంచివే. కానీ అతి శుభ్రం ఎన్ని అనర్ధాలకు దారి తీస్తుందో కదా. అదే మన హీరో శర్వానంద్‌కీ ఎన్నో చిక్కులు తెచ్చి పెట్టింది. 'మహానుభావుడు' సినిమాలో హీరో శర్వానంద్‌కి అతి శుభ్రం. తుమ్ము తుమ్మితే దూరంగా పారిపోతాడు. హీరోయిన్‌తో ముద్దు పెట్టుకోవాల్సిన సిట్యువేషన్‌లో మార్నింగ్ బ్రష్ చేశావా? అని అడుగుతాడు. మురికిగా కనిపించిందనీ, అవతలి వాళ్ల బైక్‌ని కూడా శుభ్రం చేసేస్తాడు. ఇదీ మనోడి తీరు. ఈ తీరుతోనే బోలెడంత ఫన్ క్రియేట్ చేస్తున్నాడు. మనోడి శుభ్రతతో వచ్చే ఆరోగ్యం సరగతి పక్కన పెడితే, ఆ శుభ్రత విషయంలో శర్వానంద్ పండించే కామెడీతో హాయిగా నవ్వుకుని మనం ఆరోగ్యంగా ఉంటామనేది ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే నవ్వుతూ ఉంటే మన ఆరోగంగా ఉంటాం కదా. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా ఇది. మెహరీన్ కౌర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. చాలా క్యూట్‌గా ఉంది ఈ సినిమాలో మెహరీన్. శర్వానంద్ తన స్టైల్‌లో నవ్వులు పూయిస్తున్నాడు. ఎంటర్‌టైన్‌మెంటే మెయిన్ బేస్‌మెంట్‌గా తెరకెక్కుతోంది 'మహానుభావుడు'. దసరా కానుకగా హాయిగా నవ్వులు పూయించేందుకు మనోడు ఏకంగా స్టార్ హీరోలతో పోటీ పడి మరీ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు.