శర్వానంద్ 35వ చిత్రం ఖరారైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తాను ఓ సినిమా చేస్తున్నాడు. శమంతకమణి, దేవదాస్, హీరో చిత్రాలతో ఆకట్టుకొన్నాడు శ్రీరామ్ ఆదిత్య. ఇది తనకు 4వ సినిమా. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది.
ఈరోజు శర్వానంద్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ కాంబినేషన్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు బయటకు వచ్చింది. లండన్ నేపథ్యంలో సాగే కథ ఇది. శర్వా క్యారెక్టర్ స్టైలీష్‌గా ఉండబోతోందన్న విషయం.. ఫస్ట్ లుక్ పోస్టర్ తో అర్థమైంది. మలయాళ స్వరకర్త `హృదయం` ఫేమ్ అబ్దుల్ వాహెద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. విష్ణు శర్మ కెమెరామెన్ గా బాధ్యతలు తీసుకొన్నారు. కథానాయిక, ఇతర వివరాలు వెల్లడికావాల్సివుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది. ఈ చిత్రానికి టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు.