వరుస విజయాలతో దూసుకెళ్లిపోతున్నాడు యంగ్ హీరో శర్వానంద్. సీరియస్ క్యారెక్టర్స్‌కి పెట్టింది పేరు అన్నట్లుగా తన కెరీర్‌ని మొదలు పెట్టాడు శర్వానంద్. అందులోంచే ఎలాంటి విలక్షణ పాత్రకైనా శర్వానంద్ సూటవుతాడని నిరూపించాడు. అమాయకంగా నటించినా, నెగిటివ్ రోల్ పోషించినా అది శర్వానంద్‌కి వెన్నతో పెట్టిన విద్యే అయ్యింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఆ రకంగా శర్వానంద్. కానీ 'రన్ రాజా రన్' సినిమాతో శర్వానంద్ కెరీర్ టర్న్ అయ్యింది. కామెడీ హీరో అయిపోయిడు శర్వానంద్. కామెడీతో పాటు సక్సెస్ కూడా వరించింది. తిరుగే లేకుండా వరుస హిట్లతో సక్సెస్ఫుల్ హీరో అనిపించుకుంటున్నాడు. తాజాగా 'రాధ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు శర్వా. యంగ్ హీరోలు తెలుగుతో పాటు తమిళంలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాగే తమిళ హీరోలు కూడా తెలుగులో మార్కెట్ బాగానే పెంచుకుంటున్నారు. కానీ శర్వానంద్‌కి మాత్రం తెలుగులో మాత్రమే తన టాలెంట్ నిరూపించుకోవాలనుకుంటున్నాడట. అప్పుడే తమిళం జోలికి పోనంటున్నాడు. గతంలో శర్వానంద్ నటించిన 'జర్నీ' సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. అయినా కానీ తన ఫోకస్ మాత్రం తెలుగు మీదే అని పక్కాగా చెప్పేస్తున్నాడు ఈ సంక్రాంతి బుల్లోడు. 'రన్ రాజా రన్' సినిమాతో కొత్త ట్రాక్‌లోకి అడుగు పెట్టిన శర్వానంద్ 'రాధ' సినిమాతో ఆడియన్స్‌కి మరో న్యూ ట్రీట్మెంట్ ఇచ్చానంటున్నాడు.