శర్వా - సాయి పల్లవి కెమిస్ట్రీతో పడగొట్టేశారుగా.!

By iQlikMovies - November 23, 2018 - 12:06 PM IST

మరిన్ని వార్తలు

ఫెస్టివల్‌ హీరో శర్వానంద్‌ పండగ మొదలైంది. డిశంబర్‌లో శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన 'పడి పడి లేచె' మనసు సినిమా రిలీజ్‌కి రెడీగా ఉంది. సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడడంతో చిత్ర యూనిట్‌ ప్రమోషన్స్‌ షురూ చేసింది. అందులో భాగంగా లేటెస్టుగా విడుదలైన శర్వానంద్‌ - సాయి పల్లవి డ్యూయెట్‌ సాంగ్‌ అదిరిపోతోంది. 

ఈ సాంగ్‌లో సాయి పల్లవి - శర్వానంద్‌ ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ చాలా బాగుంది. ఇక డాన్సింగ్‌ డాళ్‌ సాయి పల్లవి ఎప్పటిలాగే తన మార్క్‌ స్టైల్‌ డాన్సులతో చూపు తిప్పుకోనీయకుండా చేసేస్తోంది. ఈ సాంగ్‌లో ఆమె కాస్ట్యూమ్స్‌, ఏక్రోబాటిక్‌ బాడీతో వేస్తున్న స్టెప్పులు వర్ణనాతీతం. అందమైన బొంగరం తిరుగుతున్నట్లు, పూల గొడుగు విరబూసినట్లు, నీలి గగనాన రంగు రంగుల హరివిల్లు విచ్చుకున్నట్లు.. ఇలా ఎంత వర్ణించినా ఆమె డాన్సులకు వర్ణన తక్కువే అవుతుంది. ఈ సాంగ్‌ ప్రోమోలో ముఖ్యంగా ఆహ్లాదమైన మంచు కొండలతో సాయి పల్లవి నేచురల్‌ బ్యూటీ పోటీ పడుతోందా.? అనేలా ఉంది. 

ఇకపోతే వరుస విజయాలతో ఇటు శర్వానంద్‌, అటు సాయి పల్లవి ఇద్దరూ దూకుడు మీదున్నారు. అలాంటి ఈ సక్సెస్‌ఫుల్‌ జంట కలిసి నటిస్తున్న 'పడి పడి లేచె మనసు' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. హను రాఘవపూడి ఈ సినిమాకి దర్శకుడు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS