సినీ దిగ్గజం శశి కపూర్ ఇక లేరు

మరిన్ని వార్తలు

ప్రఖ్యాత నటుడు, నిర్మాత, దర్శకుడు- శశి కపూర్ (79) ఇక లేరు.

అందుతున్న సమాచారం ప్రకారం, కొద్దిసేపటి క్రితం ముంబైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారట. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు.

శశి కపూర్- లెజెండరీ దర్శక-నిర్మాత అయిన పృథ్వీరాజ్ కుమార్ మూడవ కొడుకు, రాజ్ కపూర్ & షమ్మి కపూర్ లకు స్వయానా సొంత తమ్ముడు. ఈయన వివాహం విదేశీయురాలైన జెన్నిఫర్ తో 1958లో జరగగా వీరికి ముగ్గురు సంతానం.

ఇక జెన్నిఫర్ 1984లో తనువు చాలించగా తరువాత కాలంలో ఆయన తన పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈయన భారతీయ చలనచిత్ర పరిశ్రమకి చేసిన సేవలకి గుర్తింపుగా 2011లో పద్మ భూషణ్, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులని ఇచ్చి సత్కరించింది.

ఈ సందర్భంగా www.iQlikmovies.com తరపున శశి కపూర్ అత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాము.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS